Mon Mar 16 2026 11:20:34 GMT+0530 (India Standard Time)
ములాయం కోడలు బీజేపీలోకి
ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణాయాదవ్ బీజేపీలో చేరారు.

ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలు చేరికలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటి వరకూ బీజేపీ నుంచి సమాజ్ వాదీ పార్టీలోకి చేరికలు ఉన్నాయి. తాజాగా ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణాయాదవ్ బీజేపీలో చేరారు. ఆమె ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య కోడలు. అపర్ణాయాదవ్ అఖిలేష్ యాదవ్ కు షాక్ ఇచ్చారనే చెప్పాలి.
అఖిలేష్ కు షాక్....
సమాజ్ వాదీ పార్టీలో చేరికలు జోరందుకుంటున్న సమయంలో అపర్ణాయాదవ్ చేరిక అఖిలేష్ యాదవ్ కు రాజకీయంగా ఇబ్బంది కల్గించే విషయమే. ఆమె చేరికతో పార్టీకి మరింత బలం చేకూరిందని బీజేపీ నేతలు అంటున్నారు. అపర్ణాయాదవ్ బీజేపీ లో చేరతారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది.
Next Story

