Fri Dec 05 2025 13:36:01 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరెస్ట్‌పై మంచు తుపాను... గల్లంతయిన పర్వతారోహకులు
టిబెట్ లో మంచు తుపాను విరుచుకుపడింది. పదహారు వేల అడుగుల ఎత్తులో వేయి మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు

టిబెట్ లో మంచు తుపాను విరుచుకుపడింది. పదహారు వేల అడుగుల ఎత్తులో వేయి మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు. వీరిలో రెండువందల మంద వరకూ స్థానికులు, రెస్క్యూ టీమ్ కాపాడగలిగారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎవరెస్ట్‌లో మంచు తుపాను కారణంగా వీరు చిక్కుకుపోయారు. ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ తూర్పు టిబెట్ వేపున ఆదివారం భారీ మంచు తుఫాను తాకింది. దీంతో అక్కడి శిబిరాల్లో దాదాపు వెయ్యిమంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు స్థానిక గ్రామస్తులు, సహాయక బృందాలు కలిపి భారీ స్థాయిలో చర్యలు చేపట్టాయి. మంచుతో మార్గాలు మూసుకుపోవడంతో వాటిని శుభ్రం చేసే పనులు కొనసాగుతున్నాయి. కొంతమంది పర్యాటకులను ఇప్పటికే బయటకు తీసుకువచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది.
మంచు తుపానుతో...
శుక్రవారం సాయంత్రం కురవడం మొదలైన మంచుటిబెట్ తూర్పు ఎవరెస్ట్ కొండలపై మరింత తీవ్రతతో కొనసాగుతోంది. ఈ ప్రాంతం పర్వతారోహకులు, ట్రెక్కర్లకు ప్రసిద్ధి. చైనాలో ‘మౌంట్ చోమోలాంగ్మా’గా పిలువబడే ఈ శిఖరం 8,849 మీటర్ల ఎత్తులో ఉంది. ఇదిలావుండగా, పొరుగున నేపాల్ దేశంలో కురుస్తున్న భారీ వర్షాలుతో ఆకస్మిక వరదలకు దారితీశాయి. వాటిలో ఇప్పటివరకు 52మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుమించి, చైనాలోని గ్వాంగ్డాంగ్, హైనాన్ రాష్ట్రాల్లో కూడా ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. 2025 పసిఫిక్ తుఫానుల సీజన్లో 21వదిగా గుర్తించిన ‘టైఫూన్ మ్యాట్మో’ ఆదివారం గ్వాంగ్డాంగ్లోని జాన్‌జియాంగ్ నగర తూర్పు తీరాన్ని తాకింది. ఈ తుఫాను గంటకు 151 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తుండటంతో అక్కడి అధికారులు 3.47 లక్షల మందిని ముందస్తుగా తరలించారు.
Next Story

