Tue Jan 20 2026 09:28:09 GMT+0000 (Coordinated Universal Time)
55వ ఏట 17వ బిడ్డకు తల్లి.. పిల్లలు ఏమి చేస్తుంటారంటే?
55 వ ఏట 17వ బిడ్డకు తల్లి అయింది ఆ మహిళ. రాజస్థాన్ ఉదయ్‌పుర్ జిల్లాలోని ఝాడోల్ బ్లాక్‌లో 55 ఏళ్ల రేఖా కల్బెలియా 17వ బిడ్డకు జన్మనిచ్చారు.

55 వ ఏట 17వ బిడ్డకు తల్లి అయింది ఆ మహిళ. రాజస్థాన్ ఉదయ్‌పుర్ జిల్లాలోని ఝాడోల్ బ్లాక్‌లో 55 ఏళ్ల రేఖా కల్బెలియా 17వ బిడ్డకు జన్మనిచ్చారు. రేఖను ఆసుపత్రిలో చేర్చినప్పుడు ఆమెకు ఇది నాలుగో కాన్పు అని ఆమె కుటుంబసభ్యులు తప్పుడు సమాచారం ఇచ్చారని వైద్యులు తెలిపారు. రేఖ భర్త చెత్త ఏరుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటారు. ఈ దంపతుల సంతానంలో 12 మంది జీవించి ఉన్నారు. వారిలో ఏడుగురు మగపిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు. ఈ పిల్లలెవరూ చదువుకోవడం లేదట.
Next Story

