Thu Jan 29 2026 15:27:56 GMT+0000 (Coordinated Universal Time)
తాజ్ మహల్ రక్షణ కోసం మరిన్ని ఏర్పాట్లు!!
తాజ్‌మహల్‌ను శత్రువులు టార్గెట్ చేసే అవకాశం ఉండడంతో, గగనతలంలో తలెత్తే ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అత్యాధునిక యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

తాజ్‌మహల్‌ను శత్రువులు టార్గెట్ చేసే అవకాశం ఉండడంతో, గగనతలంలో తలెత్తే ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అత్యాధునిక యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తాజ్‌మహల్ ప్రాంగణంలో యాంటీ డ్రోన్ వ్యవస్థను తీసుకుని రానున్నామని, 7 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తుందని భద్రతా వ్యవహారాల పర్యవేక్షణాధికారి ఏసీపీ సయ్యద్ అరిబ్ అహ్మద్ తెలిపారు.
ప్రస్తుతం ప్రధాన గోపురం నుంచి 200 మీటర్ల పరిధిలో ఈ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుందని, ఈ ప్రాంతంలోకి ఏదైనా డ్రోన్ ప్రవేశిస్తే దాని సిగ్నల్స్‌ను జామ్ చేసి పని చేయకుండా చేస్తుందని తెలిపారు. ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థ నిర్వహణపై పోలీసు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని, త్వరలోనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
Next Story

