Fri Dec 05 2025 21:56:13 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి వర్షాకాల సమావేశాలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వాడి వేడిగా కొనసాగనున్నాయి

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వాడి వేడిగా కొనసాగనున్నాయి. అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. అదే సమయంలో విపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు అధికార పార్టీ రెడీ అయింది. ఈరోజు నుంచి వచ్చే నెల 12వ తేదీ వకూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఉభయ సభల్లో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.
32 బిల్లుల వరకూ....
ఈ సమావేశాల్లో మొత్తం 32 బిల్లుల వరకూ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రధానంగా అగ్నిపథ్ పథకంపై పార్లమెంటు ఉభయ సభలు అట్టుడకనున్నాయి. అగ్నిపథ్ పథకం తేవడంతో దేశ వ్యాప్తంగా అలజడి చెలరేగిన సంగతి తెలిసిందే. అగ్నపథ్ ను వెనక్కు తీసుకోవాలని విపక్షాలు ఈ సమావేశాల్లో డిమాండ్ చేయనున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిత్యావసరాల వస్తువుల పెరుగుదల తదితర అంశాలపై కూడా అధికార పార్టీని నిలదీయాలన్న యోచనలో విపక్షాలు ఉన్నాయి.
Next Story

