Thu Jan 29 2026 04:28:21 GMT+0000 (Coordinated Universal Time)
రెండో రోజు పార్లమెంటు సమావేశాల్లోనూ
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. నిన్న ఉభయ సభలు ప్రారంభమయిన విపక్షాల ఆందోళనలతో వరసగా వాయిదా పడ్డాయి. ప్రధానంగా పహాల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్, ట్రంప్ ప్రకటన తదితర అంశాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభలను వాయిదా వేశారు.
బీహార్ లో ఓటర్ల జాబితా సవరణ...
ఈరోజు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా అంశంపై ఇండి కూటమి పార్లమెంటు ఆవరణలో నిరసన తెలియజేయనుంది. దీంతో పాటు పలు అంశాలపై చర్చించాలని, బీహార్ ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టే అవకాశముంది. జీరో అవర్ రద్దు చేసి అన్ని అంశాలపై చర్చించాలని పట్టుబడుతున్నాయి. దీంతో నేడు కూడా పార్లమెంటు ఉభయ సభలు సమావేశం ఎలా జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.
Next Story

