Thu Mar 19 2026 07:02:08 GMT+0530 (India Standard Time)
Kerala : కేరళలో మంకీపాక్స్ కలకలం.. అప్రమత్తమయిన ప్రభుత్వం
కేరళలో మంకీ పాక్స్ కలకలం సృష్టిస్తుంది. ఇద్దరికి మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ కావడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది

కేరళలో మంకీ పాక్స్ కలకలం సృష్టిస్తుంది. ఇద్దరికి మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ కావడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. యూఏఈ నుంచి ఇటీవల కేరళకు వచ్చిన ఇద్దరికి మంకీపాక్స్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మంకీపాక్స్ పాజిటివ్ గా తేలడంతో వారిని కలిసిన వారికి కూడా పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇద్దరికి సోకడంతో...
వయనాడ్ జిల్లాకు చెందని ఒక వ్యక్తికి, కన్నూరుకు చెందని ఇంకొక వ్యక్తికి మంకీపాక్స్సోకినట్లు తేలింది. మంకీపాక్స్ సోకిన వారిద్దరినీ కన్నూర్ లోని పరియారం మెడికల్ కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. వారితో కాంట్రాక్టు అయిన వారి కోసం కూడా అధికారులు గాలిస్తున్నారు. వారికి ఏమైనా లక్షణాలున్నాయేమోనని పరిశీలిస్తున్నారు. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాలనుంచి వచ్చిన వారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుని లక్షణాలు కనిపిస్తే ఐసొలేషన్ కు వెళ్లాలని ప్రభుత్వం సూచించింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

