Fri Dec 05 2025 14:16:35 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : నేడు రెండు రాష్ట్రాల్లో మోదీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ నేడు రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర పర్యటనకు వెళ్తున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్బంగా ఇటానగర్‌లో 5,100 కోట్ల రరూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే త్రిపురలోని గోమతి జిల్లాలో మాత త్రిపుర సుందరి ఆలయ సముదాయంలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
అభివృద్ధి పనులకు...
ఇటానగర్‌లో రూ.3,700 కోట్లకు పైగా వ్యయంతో రెండు పెద్ద హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇవి ప్రాంతీయ జలవిద్యుత్ సామర్థ్యాన్ని వినియోగిస్తూ, స్థిరమైన విద్యుత్ ఉత్పత్తికి తోడ్పడతాయని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. అలాగే ‘హియో’ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు (240 మెగావాట్లు), ‘టాటో–1’ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు (186 మెగావాట్లు)లను అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియోమ్ ఉపనది ప్రాంతంలో అభివృద్ధి చేయనున్నారు.
Next Story

