Fri Dec 05 2025 09:00:23 GMT+0000 (Coordinated Universal Time)
బోర్డర్ లో మాక్ డ్రిల్.. టెన్షన్ లో పాకిస్థాన్
పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న పంజాబ్, జమ్మూకశ్మీర్, గుజరాత్, హరియాణా, రాజస్థాన్‌లలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.

పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న పంజాబ్, జమ్మూకశ్మీర్, గుజరాత్, హరియాణా, రాజస్థాన్‌లలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ‘ఆపరేషన్ షీల్డ్’ పేరుతో మే 31 సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించనున్నారు. సరిహద్దు నియంత్రణ రేఖ వెంటనున్న రాష్ట్రాల్లోని ప్రజల యుద్ధ సన్నద్ధతను మరింత మెరుగుపర్చే లక్ష్యంతో ఈ మాక్ డ్రిల్‌ను నిర్వహించనున్నారు.
‘ఆపరేషన్ షీల్డ్’కు సంబంధించి ఆయా రాష్ట్రాల్లోని సివిల్ డిఫెన్స్ విభాగాలు అన్ని జిల్లా కలెక్టర్లు, మెజిస్ట్రేట్లకు మార్గదర్శకాలను జారీ చేశాయి. బ్లాకౌట్, మాక్ డ్రిల్లను సక్రమంగా నిర్వహించాలని నిర్దేశించాయి. మొత్తంగా 244 జిల్లాల్లో దీన్ని నిర్వహిస్తారు. అయితే భారత్ చేపట్టబోయే మాక్ డ్రిల్ సమయంలో పాకిస్థాన్ లో కూడా టెన్షన్ మొదలైంది. ఏమి జరుగుతుందా అనే భయం పాక్ ను కూడా వెంటాడుతోంది.
Next Story

