Fri Mar 20 2026 00:26:47 GMT+0530 (India Standard Time)
పర్సు ఎవరో కొట్టేశారు.. దయచేసి తెచ్చివ్వండి
మిథున్ చక్రవర్తి ర్యాలీ సమయంలో భారీగా జనం తరలివచ్చారు

ఏవైనా పెద్ద పెద్ద ర్యాలీలు, రాజకీయ కార్యక్రమాలు జరిగాయంటే దొంగలు తమ చేతివాటం చూపిస్తూ ఉంటారు. తాజాగా ధన్బాద్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రముఖ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి పర్సు చోరీకి గురైంది.
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అయిన చక్రవర్తి మంగళవారం ధన్‌బాద్‌లోని కలియాసోల్లో బీజేపీ అభ్యర్థి నిర్సా అపర్ణ సేన్‌గుప్తాకు మద్దతుగా ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. మిథున్ చక్రవర్తి ర్యాలీ సమయంలో భారీగా జనం తరలివచ్చారు. మిథున్ చక్రవర్తితో ఫోటోలను తీసుకోడానికి చాలా మంది వేదికపైకి ఎక్కారు. ఈ సమయంలోనే చక్రవర్తి పర్సు చోరీకి గురైంది. ఆయన వాలెట్‌ను తిరిగి ఇవ్వాలని నిర్వాహకులు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. "మిథున్ దా వాలెట్‌ను ఎవరు దొంగిలించారో, దయచేసి తిరిగి ఇవ్వమని మేము అభ్యర్థిస్తున్నాము" అని నిర్వాహకులలో ఒకరు ర్యాలీ సందర్భంగా ప్రకటించారు. అయినప్పటికీ మిథున్ చక్రవర్తి వాలెట్ ను ఎవరూ తిరిగి ఇవ్వలేదు. దీంతో ఆయన ఈవెంట్ నుండి ముందుగానే వెళ్లిపోయారు.
Next Story

