Sun Dec 14 2025 11:32:53 GMT+0000 (Coordinated Universal Time)
మినిమం బ్యాలెన్స్ ఇక అవసరం ఉండదట!!
సేవింగ్స్ ఖాతాలలో మినిమం బ్యాలెన్స్ లేకుంటే విధించే ఛార్జీలను పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేశాయి.

సేవింగ్స్ ఖాతాలలో మినిమం బ్యాలెన్స్ లేకుంటే విధించే ఛార్జీలను పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ లిస్టులో చేరాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల జులై 1, 2025 నుంచి సాధారణ సేవింగ్స్ ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్ కూడా జులై 7, 2025 నుంచి అన్ని రకాల పొదుపు ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. కెనరా బ్యాంక్ కూడా ఈ ఏడాది మే నెలలో సాధారణ సేవింగ్స్ ఖాతాలతో పాటు ఎన్ఆర్ఐ, శాలరీ ఖాతాలపై కూడా ఈ ఛార్జీని తొలగించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ వినియోగదారులకు ఊరట కల్పించింది.
Next Story

