Wed Mar 18 2026 23:54:54 GMT+0530 (India Standard Time)
అదంతా ఒట్దిదే... ఫలితాలను విశ్లేషించుకుంటాం
ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు

ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ లో తమ కారణంగా ఏ పార్టీ ఓటమి పాలు కాలేదని ఆయన చెప్పారు. తమ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ లోనూ బలోపేతం అవుతుందని చెప్పారు. తాము యూపీలో పార్టీని మరింత శక్తిమంతం చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఒక పార్టీ వల్ల ఓట్లు చీలిపోయి మరొకరు గెలుస్తారన్న వాదన అర్థరహితమని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
అన్ని రాష్ట్రాల్లో.....
తమవి ఓటు బ్యాంకు రాజకీయాలు అని దుష్ప్రచారాన్ని కొందరు చేశారన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకున్న తర్వాత ముందుకు వెళతామని అసద్ చెప్పారు. తమ పార్టీని అన్ని రాష్ట్రాల్లో విస్తృతం చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఎవరి విమర్శలను తాము పట్టించుకోబోమని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
Next Story

