Wed Mar 18 2026 22:23:20 GMT+0530 (India Standard Time)
కేంద్రంపై ఒవైసీ ఫైర్.. ఎందుకంటే?
నుపురు శర్మను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు

నుపురు శర్మను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఫిర్యాదు చేసినా పోలీసులు ఆమెను అరెస్ట్ చేయకపోవడాన్ని ఒవైసీ తప్పుపట్టారు. బీజేపీ ప్రభుత్వం నుపురుశర్మను కాపాడుతుందన్న ఒవైసీ, అందరికీ ఒకే న్యాయం ఉండాలని అన్నారు.
ప్రపంచమే తప్పుపడుతున్నా....
నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనమయ్యాయన్నారు. అన్ని దేశాలు ఖండించాయన్నారు. చివరకు భారత్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందన్నారు అసదుద్దీన్ ఒవైసీ. అటువంటి నుపుర్ శర్మ పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రపంచాన్నే విస్మయానికి గురి చేస్తుందన్నారు. నుపుర్ శర్మను అరెస్ట్ చేయకపోవడానికి కారణాలను చెప్పాలని ఒవైసీ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు.
Next Story

