Sat Mar 07 2026 20:26:43 GMT+0530 (India Standard Time)
అందుకే పీవోకే అంశాన్ని తెరపైకి తెస్తున్నారు
పీఓకేపై బీజేపీకి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు

పీఓకేపై బీజేపీకి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల సమయంలోనే బీజేపీ పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశాన్ని తెరపైకి తెస్తోందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. పీఓకే భారత్ తో అంతర్భాగమని తాము కూడా చెబుతున్నామని అన్నారు. కానీ పదేళ్ల పాలనలో దాన్ని స్వాధీనం చేసుకోవడానికి మోదీ ఎలాంటి చర్యలు చేపట్టారని ప్రశ్నించారు.
ఎన్నికల కోసమే...
ఆయన ఉత్తర్ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో నిర్వహించిన ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎన్నికల కోసమే పీవోకే అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి భయంతో ఏదో ఒక సెంటిమెంట్ తో తిరిగి అధికారంలోకి రావాలని ఇలా అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు.
Next Story

