Mon Mar 16 2026 07:49:26 GMT+0530 (India Standard Time)
ఇళ్ల మధ్యలో కూలిన విమానం
రాజస్థాన్లో మిగ్ 21 విమానం కుప్పకూలింది. ఇళ్ల మధ్యలో కూలడంతో ఇద్దరు మృతి చెందారు

రాజస్థాన్లో మిగ్ 21 విమానం కుప్పకూలింది. ఇళ్ల మధ్యలో కూలడంతో ఇద్దరు మృతి చెందారు. హనుమాన్ఘర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విమానం సూరత్ నుంచి టేకాఫ్ అయినట్లు సమాచారం.
ఇద్దరు మృతి...
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇళ్ల మధ్య విమానం కూలడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. జనావాసాల మధ్యకూలడంతో వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతుంది.
Next Story

