Tue Dec 16 2025 23:48:08 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మెట్రో లో ప్రయాణం ఫ్రీ
భారత్ - ఇంగ్లండ్ టీ 20 మ్యాచ్ కు జరగడంతో చెన్నైలోని ప్రయాణికులకు మెట్రో రైలు సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది

భారత్ - ఇంగ్లండ్ టీ 20 మ్యాచ్ కు జరగడంతో చెన్నైలోని ప్రయాణికులకు మెట్రో రైలు సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈరోజు మెట్రో రైలులో ప్రయాణం ఉచితం అని పేర్కొంది. చెపాక్ స్టేడియంలో నేటి రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండటంతో మెట్రో రైలులో ప్రయాణాన్ని ఉచితం అంటూ ప్రకటించింది. అయితే చెపాక్ స్టేడియంలో టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మాత్రమే టిక్కెట్ లేకుండా ప్రయాణమని చెప్పింది.
మెట్రో రైలు వేళలను...
దీంతో పాటు ఈరోజు మెట్రో రైలు వేళలను కూడా పొడిగించింది. భారత్ - ఇంగ్లండ్ టీ 20 మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభమై పదకొండు గంటల వరకూ సాగుతుండటంతో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకూ మెట్రో రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు తెలిపింది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు ఈ వేళలను పొడిగించింది. దీనివల్ల చెన్నై పట్ణణంలో రద్దీ కూడా తక్కువగా ఉండే అవకాశముందని ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story

