Sun Dec 14 2025 19:32:11 GMT+0000 (Coordinated Universal Time)
Tamilnadu : టిక్కెట్ రాలేదని ఎంపీ ఆత్మహత్యాయత్నం.. గుండెపోటుతో మృతి
తనకు టిక్కెట్ రాలేదన్న ఆవేదనతో డీఎండీకే పార్లమెంటు సభ్యుడు గుండెపోటుతో మరణించారు

తనకు టిక్కెట్ రాలేదన్న ఆవేదనతో డీఎండీకే పార్లమెంటు సభ్యుడు గుండెపోటుతో మరణించారు. తమిళనాడులో ఈ ఘటన సంచలనం కలిగించింది. డీఎండీకే గశేశ్ మూర్తి 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఈరోడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈసారి ఆయనకు కాకుండా మరొకరికి టిక్కెట్ ఇవ్వడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారని ఆయన తరుపున బంధువులు చెబుతున్నారు. దీంతో ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.
ఈరోడ్ టిక్కెట్ దక్కలేదని...
ఆత్మహత్యకు యత్నించిన గణేశ్మూర్తిని వెంటనే కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చించారు. ఆయనకు ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో ఆసుపత్రిలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కూటమిలో భాగంగా ఈరోడ్ టిక్కెట్ తనకు దక్కకపోవడం వల్లనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గణేశ్ మూర్తి శాసనసభ్యుడిగా, ఎంపీగా కూడా పనిచేశారు.
Next Story

