Wed Jan 28 2026 17:45:21 GMT+0000 (Coordinated Universal Time)
Union Cabinet : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం
నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది

నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఉదయం పదకొండు గంటలకు సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పెహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి అనంతరం తీసుకున్న చర్యలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కేంద్ర మంత్రి వర్గ సమావేశం చర్చించనుంది. పాకిస్థాన్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ దాడులకు దిగి ఆపరేషన్ సింధూర్ పైన, తర్వాత అనంతర పరిస్థితులపైన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.
భారత్ - పాక్ ఉద్రిక్తతలపై...
ఈ సమావేశంలో భారత్-పాక్ ఉద్రిక్తతలు, ఇతర జాతీయ అంశాలపై చర్చించనుంది. త్రివిధ దళాధిపతులతో ఇప్పటికే సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ వాటి వివరాలను మంత్రులకు వివరించే అవకాశముంది. పాక్ యుద్ధానికి కాలు దువ్వతున్న వేళ, మరిన్ని ఆంక్షలు అమలు చేసే దిశగా భారత్ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని,అలాగే యుద్ధం ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా చర్యలపై కేంద్ర మంత్రి వర్గ సమావేశం చర్చించనుంది. రేపటి భేటీలో కీలక నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది.
Next Story

