Wed Mar 18 2026 19:37:38 GMT+0530 (India Standard Time)
నేడు ఇండియా కూటమి నేతల భేటీ
నేడు ఢిల్లీలో విపక్ష కూటమి నేతల సమావేశం జరగనుంది. ఫలితాల సరళిపై చర్చించనుంది

నేడు ఢిల్లీలో విపక్ష కూటమి నేతల సమావేశం జరగనుంది. ఈరోజు లోక్సభ ఎన్నికల చివరి దశ ముగియనుండటంతో ఇండియా కూటమి నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలపై పరిస్థితిని సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల భేటీ జరగనుంది.
ఫలితాలపై...
ప్రధానంగా రానున్న ఫలితాలపై ఇండియా కూటమి నేతలు చర్చించనున్నారు. సమీక్ష చేయనున్నారు. ఉత్తరభారతంలో బీజేపీకి సీట్లు తగ్గుతాయన్న అంచనాతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్డీఏ కూటమికి ఎక్కువ స్థానాలు రావన్న అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు ఈరోజు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు.
Next Story

