Fri Dec 05 2025 09:05:36 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఆల్ పార్టీ మీటింగ్
నేడు పార్లమెంటు ఉభయ సభల్లో అన్ని పక్షాల నేతల సమవేశం జరగనుంది

నేడు పార్లమెంటు ఉభయ సభల్లో అన్ని పక్షాల నేతల సమవేశం జరగనుంది. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరనున్నారు. పార్లమెంటు అనుబంధ భవనంలో ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం జరుగుతుందని అన్ని పార్టీల నేతలకు సమాచారం ఇచ్చారు.
రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు...
రేపటి నుంచి పార్లమెంటు ఉభయ సభలు వర్షాకాల సమావేశాల కోసం ప్రారంభమవుతున్నాయి. విపక్షాలు ఇప్పటికే వర్చువల్ గా సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంటు సమావేశాల్లో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించాలని నిర్ణయించారు. పహాల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ తో పాటు ట్రంప్ ప్రకటనపై చర్చించేందుకు పట్టుబట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నేడు పార్లమెంటు ఉభయ సభలకు చెందిన అన్ని పక్షాల నేతలతో కిరణ్ రిజిజు సమావేశం కానున్నారు.
Next Story

