Thu Mar 19 2026 10:05:47 GMT+0530 (India Standard Time)
రేపు మాంసం విక్రయాలపై నిషేధం
ఇప్పటికే అక్కడ వినాయకచవితి, మహాశివరాత్రి పండుగ రోజుల్లో మాంసం విక్రయాలను నిషేధించారు. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా..

బెంగళూరు : రేపు మాంసం విక్రయాలను నిషేధిస్తూ బృహత్ బెంగళూరు మహానగర పాలికే ఆదేశాలు జారీ చేసింది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రేపు బెంగళూరులో మాంసం దుకాణాలతో పాటు కళేబరాలను కూడా మూసివేయాలని బీబీఎంపీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే అక్కడ వినాయకచవితి, మహాశివరాత్రి పండుగ రోజుల్లో మాంసం విక్రయాలను నిషేధించారు. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా కూడా మాంసం విక్రయాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు దక్షిణ ఢిల్లీలోనూ మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. ఏప్రిల్ 4 నుంచి 11వ తేదీ వరకూ దక్షిణ ఢిల్లీ పరిధిలో మాంసం దుకాణాలను మూసివేస్తున్నట్లు మేయర్ ముఖేష్ సూర్యన్ ఆదేశాలు జారీ చేశారు. నవరాత్రుల సందర్భంగా అక్కడ 99 శాతం మంది ప్రజలు మాంసం తో పాటు వెల్లుల్లి, ఉల్లి ని కూడా ముట్టరని ఆయన చెప్పారు.
Next Story

