Tue Dec 16 2025 09:14:01 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సుల్లో మంటలు
ఢిల్లీ–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సుల్లో మంటలు చెలరేగాయి.

ఢిల్లీ–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సుల్లో మంటలు చెలరేగాయి. మధుర సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. అయితే ప్రాణనష్టంపై వివరాలు అందాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్ మథుర జిల్లాలోని ఢిల్లీ–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం తెల్లవారుజామున పలు బస్సులో ఒక్కసారిగా మంటల్లో చిక్కాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పొగమంచు కారణమా?
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నాలు చేపట్టారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా, సోమవారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని పలు నగరాలు ఘన పొగమంచుతో కమ్ముకున్నాయి. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదంతో హైవేపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.
Next Story

