Sat Dec 13 2025 22:32:19 GMT+0000 (Coordinated Universal Time)
Maoists : మావోయిజం ఇక అంతరించినట్లేనా? కీలక నేతల మరణంతో?
మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు మావోయిజం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది

మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు మావోయిజం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. టాప్ మోస్ట్ లీడర్లంతా సరెండర్ అవుతున్నారు. మొండికేసిన అగ్రనాయకులు ఎన్ కౌంటర్ లో మరణిస్తున్నారు. తుపాకీతోనే సమ సమాజం ఏర్పడుతుందని భావించి అడవి బాట పన్నిన అన్నలు క్రమంగా కనుమరుగవుతున్నారు. నంబాల కేశవరావు మరణం తర్వాత వరసగా సరెండర్లతో పాటు ఎన్ కౌంటర్లతో అడవుల్లో మావోలు ఖాళీ అయిపోతున్నారు. ఉన్నత విద్య చదివి ఉన్నత ఆశయాల కోసమే అడవి బాట పట్టినా అది రాజ్యాంగ విరుద్ధం కావడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని కగార్ ను ప్రారంభించింది. ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులలోకంగారు మొదలయింది.
అడవిలో ఉండాల్సిన...
అడవిలో ఉండాల్సిన మావోయిస్టులు పట్టణం బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ లో యాభై మంది మావోయిస్టులు ఒకేరోజు దొరకడం అంటే మామూలు కాదు. హిస్టరీ. మావోయిస్టు అగ్రనేత చలపతి మరణించడం కూడా ఈ ఉద్యమం దెబ్బతినడానికి కారణం. హిడ్మా మృతితో ఇక మావోయిజం దాదాపు కనుమరుగైందని చెప్పాలి. ఒక్కొక్కరిపై కోటి రూపాయల రివార్డు ఉన్నాయంటే వారికోసం వేట ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. దండకారణ్యాన్ని వదిలి జనారణ్యానికి వస్తున్నారంటే వారు పూర్తిగా గన్ లు పైకి ఎత్తినట్లే. కేంద్ర కమిటీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక మిగిలిన చిన్నా చితకా నాయకత్వం లొంగిపోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇక గతంలో మాదిరిగా గిరిజనుల నుంచి సహకారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. రిక్రూట్ మెంట్ కూడా జరగడం లేదు.
ఇన్ ఫార్మర్ల ప్రమేయం...
మాస్టర్ మైండ్ మావో లీడర్లందరూ మరణించడంలో ఇన్ ఫార్మర్ల ప్రమేయం ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్ ఫార్మర్లు పూర్తిగా భద్రతాదళాలకు సహకరిస్తున్నారు. తమ ప్రాంత అభివృద్ధిని వేగంగా కోరుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. కీలక నేతలు కొందరు హతమయ్యారు. మరికొందరు గన్ లు వదిలి సరెండర్ అయ్యారు. ఇక అడవుల్లో ఉండి చేసేదేమీ లేదు. అందుకే బయటకు వచ్చిసిద్ధాంతాలను పక్కన పెట్టడమే మంచిదన్న భావన మావోల్లో కనిపిస్తుంది. తినీ తినక,నిద్రపోయి పోక.. నిరంతరం టెన్షన్ మధ్య బతికే కన్నా ఇక జనజీవన స్రవంతిలో కలసి పోవడమే మంచిదన్న నిర్ణయానికి రావడంతో 2025 మావోయిజానికి ఎదురుదెబ్బ అని చెప్పక తప్పదు. ఇక మావోయిజం దాదాపు లేనట్లేనని అనుకోవాలి.
Next Story

