Wed Jul 09 2025 19:47:57 GMT+0000 (Coordinated Universal Time)
Maoists : కేశవరావును సజీవంగా పట్టుకుని తర్వాత చంపారు : లేఖలో మావోయిస్టులు
మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతిపై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు.

మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతిపై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. నంబాల కేశవరావను పట్టుకుని తర్వాత భద్రతాదళాలు కాల్చి చంపారని తెలిపారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ నుంచి లేఖను విడదుల చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు అందించిన సమాచారం తోనే భద్రతాదళాలు అక్కడ కూంబింగ్ జరిపాయన్నారు. మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు. తమ నాయకుడిని కాపాడుకోవడంలో తాము విఫలమయ్యామని తెలిపారు. ఆరునెలలుగా మాడ్ ప్రాంతంలో కేశవరావు ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసునని తెలిపారు. యూనిఫైడ్ కమాండో సభ్యుడు ద్రోహిగా మారి వారికి సమాచారం అందించారన్నారు. తాము కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాల్సిందిగా కోరామని, అయితే ఆయన అందుకు నిరాకరించారని కూడా చెప్పారు.
తమను వదలి వెళ్లడానికి...
తాను నాయకుడిగా మిగిలిన వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన ఇక్కడే ఉండిపోయారని, తమను వదిలి కేశవరావు వెళ్లలేదని తెలిపారు. పాక్ తో శాంతి చర్చలకు సిద్ధమైన భారత ప్రభుత్వం తమతో మాత్రం చర్చలకు సిద్ధం కాలేదని మావోయిస్టులు లేఖలో పర్కన్నారు. తాము కాల్పుల విరమణను పాటించినా భద్రతాదళాలు మాత్రం దానిని పాటిచంలేదని తెలిపారు. కేశవరావు టీంలో ఉన్న ఆరుగురు సభ్యులు ఇటీవల ప్రభుత్వానికి లొంగిపోయారని వారు ఇచ్చిన సమాచారంతోనే ఇంతటి దారుణం జరిగిందని తెలిపార. ఎన్ కౌంటర్ ముందు రోజు నుంచి ఇరవై వేలమంది భద్రతాబలగాలు తమ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని, పది గంటల్లో ఐదు ఎన్ కౌంటర్లు జరిగాయని తెలిపారు. కేశవరావును కాపాడుకునేందుకు ముప్పయి ఐదు మంది తమ ప్రాణాలు కోల్పోయారని కూడా చెప్పారు.
Next Story