Tue Dec 16 2025 23:44:24 GMT+0000 (Coordinated Universal Time)
26న మావోయిస్టుల బంద్ కు పిలుపు
మావోయిస్టులు బంద్ కు పిలుపు నిచ్చారు. మే 26న బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు నిచ్చింది.

మావోయిస్టులు బంద్ కు పిలుపు నిచ్చారు. మే 26న బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు నిచ్చింది. బీజాపూర్, సుకుమా ధంతేవాడ జిల్లాల బంద్ కు పిలుపు ఇచ్చింది. ఇటీవల ఛత్తీస్గడ్ దండకారణ్యంలో వరసగా జరగుతున్న ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించిన నేపథ్యంలో బంద్ కు పిలుపు నిచ్చారు.
మారణకాండకు వ్యతిరేకంగా...
పోలీసులు జరుపుతున్న మరణకాండలకు వ్యతిరేకంగా మావోయిస్టుల బంద్ కు పిలుపు నిచ్చారు. దీంతో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఈరోజు నుంచే అటు వైపు వెళ్లే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. రహదారులపై మందుపాతరల వంటివి పెట్టారన్న అనుమానంతో అణువణువునూ చెక్ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు.
Next Story

