Fri Dec 05 2025 12:25:25 GMT+0000 (Coordinated Universal Time)
మల్లోజుల ఆయుధాలు ముఖ్యమంత్రికి అప్పగింత
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు.

మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు మరో అరవై మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈరోజు గడ్చిరోలి పోలీసులు మల్లోజుల వేణుగోపాల్ తో పాటు అరవై మంది మావోయిస్టులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి ఆయుధాలను మల్లోజుల అప్పగించారు. లొంగిపోయినఅరవై మంది మావోయిస్టులు తమ ఆయుధాలను అప్పగించారు.
చెక్కులు అందించి...
మల్లోజుల వేణుగోపాల్ గడ్చిరోలి ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. ఆయనపై వంద కేసులున్నాయి. కోటి రూపాయల రివార్డు ఉంది. మల్లోజుల వేణుగోపాల్ అతని బృందం లొంగుబాటుతో గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమానికి భారీగా దెబ్బపడినట్లేనని అంటున్నారు. ఈ సందర్భంగా జనజీవన స్రవంతిలో కలిసినందుకు లొంగిపోయిన మావోయిస్టులకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రివార్డులను చెక్కు రూపంలో అందించారు. మిగిలిన వారు కూడా తమంతట తాముగా వచ్చి లొంగిపోవాలని ముఖ్యమంత్రి కోరారు.
Next Story

