Thu Mar 12 2026 16:58:40 GMT+0530 (India Standard Time)
చంద్రగ్రహణం అయినా సరే.. తెరిచి ఉండే ఆలయాలు ఇవే
చంద్ర గ్రహణం కారణంగా ఈరోజు భారతదేశంలోని చాలా ఆలయాలు మూసివేస్తారు

చంద్ర గ్రహణం కారణంగా ఈరోజు భారతదేశంలోని చాలా ఆలయాలు మూసివేస్తారు. దర్శనాలకు అనుమతించరు. అన్ని రకాల సేవలను నిలిపివేస్తారు. తిరిగి చంద్ర గ్రహణం పూర్తయిన తర్వాత మాత్రమే ఆలయాలను సంప్రోక్షణ చేసిన తర్వాత మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిసత్ారు. . అయితే కొన్ని ఆలయాలను మాత్రం తెరిచే ఉంటాయి.
నేడు తెరిచి ఉండే ఆలయాలివే...
దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి, తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయం, కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం ఇవాళ తెరిచే ఉంటాయి. అలాగే, ఉత్తరాదిలో మధ్య ప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్, ఢిల్లీలోని కల్కాజీ దేవి, బీహార్‌లోని విష్ణుపద్, రాజస్థాన్‌లోని లక్ష్మీనాథ్ టెంపుల్, ఉత్తరాఖండ్‌లోని కల్పేశ్వర్ ఆలయాలు చంద్రగ్రహణం ఉన్నా తెరిచే ఉంటాయి
Next Story

