Sun Mar 08 2026 01:03:59 GMT+0530 (India Standard Time)
ముంబైలోని శివాజీ పార్క్ లో అంత్యక్రియలు
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ లత మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె లేని లోటు తీర్చలేదని అన్నారు. బాలీవుడ్ ప్రముఖులు లత మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు. లతా మంగేష్కర్ ఈరోజు బ్రీచ్ కండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.
రెండు రోజులు సంతాప దినాలు...
లతా మంగేష్కర్ పార్ధీవ దేహాన్ని మరికాసేపట్లో ఆమె స్వగృహానికి తీసుకురానున్నారు. ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు ముంబయిలోని శివాజీ పార్క్ లో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. లతామంగేష్కర్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం లతా మంగేష్కర్ మృతికి రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది.
Next Story

