Sun Mar 15 2026 13:08:35 GMT+0530 (India Standard Time)
రెండోసారి ముఖ్యమంత్రిగా
త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి సీఎంగా బాధ్యతలు ఆయన బాధ్యతలను చేపట్టారు.

త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేశారు. త్రిపుర ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు ఆయన బాధ్యతలను చేపట్టారు. గవర్నర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు ఎనిమిది మంత్రలు కొద్దిసేపటి క్రితం త్రిపుర రాజధాని అగర్తాలాలో ప్రమాణ స్వీకారం చేశారు.
వన్‌సైడ్ విజయం...
ఇటీవల జరిగిన ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ వన్ సైడ్ విజయం సాధించింది. రెండోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపురలో బీజేపీ 32 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో పార్టీ అధినాయకత్వం మరోసారి మాణిక్ సాహాను ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు హాజరయ్యారు.
Next Story

