Thu Dec 18 2025 09:13:06 GMT+0000 (Coordinated Universal Time)
Tiger : హమ్మయ్య మ్యాన్ ఈటర్... పులి చనిపోయింది..చంపేశారా?
కేరళ వాయనాడ్ లో మనుషులను చంపుతున్న పులి చనిపోయింది.

కేరళ వాయనాడ్ లో మనుషులను చంపుతున్న పులి చనిపోయింది. చిరుత కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు కాఫీ తోటల్లో గుర్తించారు. మనుషులను చంపేస్తున్న పులిని చంపేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో ఒక పులిని కేరళ ప్రభుత్వం మ్యాన్ ఈటర్ గా ప్రకటించింది. మనంతవాడి కాఫీ తోటల్లో పనిచేస్తున్న పులి ఒక మహిళను చంపేసింది.
శరీరంపై గాయాలు...
పులి అక్కడే సంచరిస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో మనంత వాడిలో అధికారులు కర్ఫ్యూను కూడా విధించారు. పులి వరస దాడులపై స్పందించిన కేరళసర్కార్ చంపేయాలని ఆదేశించడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి దాని కోసం సెర్చ్ చేస్తున్నారు. అయితే పులి మరణించి ఉండటాన్ని గమనించారు. తాము కాల్చిచంపలేదని, పులి శరీరంపై గాయాలున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
Next Story

