Sun Mar 15 2026 11:33:23 GMT+0530 (India Standard Time)
Heart Attack : శివాలయంలో పూజలు చేస్తూ కుప్పకూలిన వ్యక్తి
గుజరాత్ లోని శివాలయంలో పూజలు చేస్తూ గుండెపోటుతో ఒక వ్యక్తి కుప్పకూలి మరణించిపోయారు.

ఇటీవల కాలంలో గుండెపోటు సంబంధిత మరణాలు ఎక్కువయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెనొప్పితో మరణిస్తున్నారు. కొందరికి సకాలంలో సీపీఆర్ అందించిన వెంటనే వారు కోలుకుంటున్నారు. అయితే మరికొందరు మాత్రం కుప్పకూలి మరణిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
గుజరాత్ లో ఘటన...
తాజాగా గుజరాత్ లోని శివాలయంలో పూజలు చేస్తూ గుండెపోటుతో ఒక వ్యక్తి కుప్పకూలి మరణించిపోయారు. శివలింగానికి అభిషేకం చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. కార్తీక మాసం కావడంతో శివాలయంలో పూజలు చేయడానికి వచ్చి వ్యక్తి మరణించడంతో విషాదం నెలకొంది. గుజరాత్ రాష్ట్రం వల్సాద్ జిల్లాలోని ఓ శివాలయంలో ఘటన జరిగింది. మరణించిన వ్యక్తి కిషోర్ పటేల్ గా గుర్తించారు.
Next Story

