Fri Dec 05 2025 12:25:23 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : పోలీసుల ఎదుట మల్లోజుల లొంగుబాటు
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు పోలీసుల ఎదుట లొంగిపోయారు

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో మావోయిస్టులకు భారీగా ఎదురుదెబ్బ తగిలింది. ముప్ఫయి మంది మావోయిస్టులతో కలసి మల్లోజుల గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. గడ్చిరోలి ప్రాంతంలో కీలక నేతగా ఉన్న మల్లోజుల వేణుగోపాలరావు గత కొంతకాలంగా పార్టీ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఆయుధాలను విడిచిపెట్టాలని, ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఆయన సూచించారు.
కోటి రూపాయల రివార్డు...
మల్లోజుల వేణుగోపాలరావు పై కోటి రూపాయల రివార్డు ఉంది. మల్లోజుల స్వస్థలం తెలంగాణలోని పెద్దపల్లి. ఇటీవల కాలంలో దేశంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది. ఛత్తీస్ గఢ్, జార్ఖంఢ్ వంటి ప్రాంతాల్లో భద్రతాదళాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే వందల మంది సంఖ్యలో మావోయిస్టులు మరణించగా, మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దాదాపు ముప్ఫయి ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో కొనసాగిన మల్లోజుల వేణుగోపాలరావుపై వందల సంఖ్యలో కేసులున్నాయి.
Next Story

