Fri Jan 30 2026 08:43:45 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ ఎన్నికల్లో ఖర్గే విజయం
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే భారీ ఆధిక్యతతో విజయం సాధించారు.

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం కాకుండా ఇతరులు అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. మల్లికార్జున ఖర్గే కు 7,897 ఓట్లు రాగా, శశిథరూర్ కు 1,072 ఓట్లు మాత్రమే వచ్చాయి. చెల్లని ఓట్లు 416 గా ఉన్నాయి.
24 ఏళ్ల తర్వాత...
దీంతో భారత జాతీయ కాంగ్రెస్ కు మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికయిన ఖర్గేకు శశిథరూర్ అభినందనలు తెలిపారు. మొన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఈరోజు కౌంటింగ్ జరిగింది. మొత్తం 9 వేల మంది ఓటు హక్కు వినియోగించుకోగా ఎక్కువ ఓట్లు మల్లికార్జున ఖర్గేకు లభించాయి.
Next Story

