Sun Mar 15 2026 18:21:43 GMT+0530 (India Standard Time)
శబరిమలలో మకరజ్యోతి దర్శనం
శబరిమలలో మకర జ్యోతి సాక్షాత్కరించింది. శరణు ఘోషతో శబరిమల మార్మోగుతుంది.

శబరిమలలో మకర జ్యోతి సాక్షాత్కరించింది. శరణు ఘోషతో శబరిమల మార్మోగుతుంది. ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున జ్యోతి దర్శనం లభిస్తుంది. పొన్నంబలమేడులో మకర జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వేచి చూస్తున్నారు. ఈ రోజు కోసం అయ్యప్ప భక్తులంతా వేచి చూస్తుంటారు. జ్యోతిని చూసి తన్మయత్వంలో మునిగిపోతారు.
భక్తులు భారీ సంఖ్యలో....
అయ్యప్ప స్వామికి ప్రత్యేకంగా రాజు కుటుంబం ఇచ్చిన ఆభరణాలను అలంకరించారు. భక్తులతో శబరిమల కిటకిటలాడింది. స్వామియే శరణం అయ్యప్ప నినాదాలు మార్మోగి పోయాయి. భక్తులు భారీగా మకరజ్యోతి దర్శనానికి రావడంతో పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

