Fri Dec 05 2025 16:39:26 GMT+0000 (Coordinated Universal Time)
మహా కుంభమేళా లో అగ్ని ప్రమాదం
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో పెద్ద అగ్నిప్రమాదం జరిగింది

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం చూసిన వెంటనే భక్తులు పరుగులు తీశారు. దీంతో కొంత తొక్కిసలాట జరిగింది. అయితే ఒక చోట వంట గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. వరసగా రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
భయంతో భక్తులు పరుగులు తీసి...
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భక్తులు బయటకు పరుగులు తీశారు. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఘటనస్థలిని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ సందర్శించారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. అయితే ప్రమాదానికి కారణం గ్యాస్ సిలిండర్ పేలడమా? ఎవరైనా అసాంఘిక శక్తుల పనా? అన్నది తేల్చేందుకు విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
Next Story

