Fri Dec 05 2025 09:06:55 GMT+0000 (Coordinated Universal Time)
జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్ .. ఆరుగురు మావోయిస్టుల మృతి
జార్ఖండ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు

జార్ఖండ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. జార్ఖండ్ లోని బొకారో జిల్లా లాల్పానియా దగ్గర ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతి చెందిన ఆరుగురు మావోయిస్టులను గుర్తించే పనిలో పడ్డారు.
ఎదురు కాల్పుల్లో...
సీఆర్పీఎఫ్, జార్ఖండ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఈ ఆపరేషన్ లోనే ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు గాలిస్తుండగా మావోలు తారసపడ్డారు. ఇద్దరి మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల వరసగా మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ అటవీ ప్రాంతంలో చేపట్టిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Next Story

