Thu Jan 22 2026 07:53:24 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : పది మంది మావోయిస్టుల మృతి
జార్ఖండ్ లోని చైబాసా ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.

జార్ఖండ్ లోని చైబాసా ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాదళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పది మంది మావోయిస్టులు మరణించారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. మావోయిస్టులు అక్కడ ఉన్నారని తెలుసుకున్న భద్రతాదళాలు వారి కోసం వెదుకుతుండగా మావోయిస్టులు తారసడి కాల్పులకు తెగబడ్డారని పోలీసులు తెలిపారు.
ఎదురు కాల్పుల్లో...
తాము కూడా ఎదురు కాల్పులు జరిపామని పోలీసు అధికారులు వివరించారు. పది మంది మావోయిస్టుల మృతదేహలను భద్రతా దళాలు తమ స్వాధీనంలోకి తీసుకుని ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించనున్నాయి. అలాగే వారి వద్ద నుంచి ఆయుధాలు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా చైబాసా ప్రాంతంలో భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతుంది.
Next Story

