Fri Dec 05 2025 09:28:26 GMT+0000 (Coordinated Universal Time)
గూడ్స్ రైలులో మంటలు.. 300 కుటుంబాలను ఖాళీ చేయించిన అధికారులు
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. తరువళ్లూరు లో డిజిల్ లోడ్ తో వెళుతున్న గూడ్స్ రైలులో మంటలు వ్యాపించాయి

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. తరువళ్లూరు లో డిజిల్ లోడ్ తో వెళుతున్న గూడ్స్ రైలులో మంటలు వ్యాపించాయి. క్షణాల్లోనే వ్యాగన్లకు మంటలు అంటుకున్నాయి. వెళుతున్న గూడ్స్ రైలులో మంటలు రావడంతో రైలును నిలిపి వేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అఅదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపేశారు. ట్రాక్ సమీపంలోని ఇళ్లను కూడా అధికారులుఖాళీ చేయించారు. దాదాపు మూడు వందల కుటుంబాలను ఖాళీ చేయించారు.
అరక్కోణం నుంచి చెన్నై వెళుతున్న...
అరక్కోణం నుంచి చెన్నై వెళుతున్న గూడ్స్ రైలులో ఒక్కసారిగా మంటలు రావడంతో పాటు అందులో డీజిల్ ఉండటంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. దీనికి తోడు గాలి కూడా వీస్తుండటంతో మంటలను అదుపులోకి తేవడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంటలు వ్యాపించకుండా తిరువళ్లూరు ఎస్సీ కాలని, వరదరాజనగర్ కు చెందిన ఇళ్లను అధికారులు ఖాళీ చేయించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కాగా మంటల వ్యాప్తికి కారణం తెలియరాలేదు. దీనిపై రైల్వే శాఖ దర్యాప్తునకు ఆదేశించనుంది.
Next Story

