Fri Dec 05 2025 22:08:34 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం
కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను తెరవాలని నిర్ణయించింది.

మహారాష్ట్రలో నేటి నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ప్రభుత్వం విద్యాసంస్థలను తెరవాలని నిర్ణయించింది. నిన్న మొన్నటి వరకూ మహారాష్ట్రలో కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా విపరీతంగా నమోదయ్యాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
ఆన్ లైన్ క్లాసులు...
నైట్ కర్ఫ్యూ తో పాటు వీకెండ్ లాక్ డౌన్ ను కూడా విధించింది. కానీ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో విద్యా సంవత్సరం వృధా కాకుండా పాఠశాలలు, కళాశాలలను తెరవాలని నిర్ణయించింది. దీంతో పాటు ఆన్ లైన్ క్లాసులను కూడా అనుమతించింది.
Next Story

