Fri Dec 05 2025 19:42:53 GMT+0000 (Coordinated Universal Time)
Presence Of Mind: చిరుతను ఇలా కూడా బంధించేయొచ్చా.. పిల్లాడి తెలివి అమోఘం
అడవి జంతువులను చూస్తే చాలు మనకు వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది

అడవి జంతువులను చూస్తే చాలు మనకు వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అలాంటిది మీరు ఉన్న రూమ్ లోకి చిరుత వచ్చేస్తే.. వామ్మో ఆ ఊహతోనే కాళ్లు చేతులు ఆడవు అని అంటారా!! అయితే ఓ పిల్లాడు మాత్రం ఎంతో సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. చిరుతపులిని చూడగానే టెన్షన్ పడకుండా.. తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ను పక్కన పెట్టేసి.. రూమ్ డోర్ మూసేసి వచ్చేశాడు. ఆ తర్వాత లోపల చిరుతపులి ఉందంటూ అందరికీ సమాచారం ఇచ్చాడు. ఎలాంటి కష్టాన్నైనా ఇంత కూల్ గా డీల్ చేయొచ్చా అని ఆ పిల్లాడిని చూశాక అందరికీ అనిపిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా.. ఆ పిల్లాడిపై ప్రశంసలు కురుస్తూ ఉన్నాయి.
మహారాష్ట్రకు చెందిన 12 ఏళ్ల మోహిత్ అహిరే అనే చిన్నారి తన ఫోన్లో గేమ్‌లు ఆడుతూ బిజీగా ఉండగా, అదే చిన్న గదిలోకి చిరుతపులి ప్రవేశించింది. పెద్ద పిల్లి ఆ పిల్లవాడిని గమనించకుండా అతనిని దాటి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ పిల్లాడు ఆ రూమ్ లో నుండి బయటకు వెళ్ళిపోయి తలుపు లాక్ చేసాడు. దీంతో చిరుత లోపలే ఉండిపోయింది. ఈ సంఘటన మార్చి 05 న మాలేగావ్‌లో జరిగింది, ఆ సమయంలో పిల్లవాడు పెళ్లి మండపం వద్ద ఉన్నాడు. పిల్లాడు చాకచక్యంగా ప్రమాదం నుంచి తప్పించుకున్న వెంటనే గదిలో చిక్కుకున్న చిరుతపులి గురించి తండ్రికి సమాచారం అందించాడు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను వెంటనే పిలిపించారు. 5 సంవత్సరాల వయస్సు ఉన్న పెద్ద పిల్లిని బంధించారు అటవీ అధికారులు.
Next Story

