Thu Dec 18 2025 13:42:10 GMT+0000 (Coordinated Universal Time)
Maha Kumbh Mela : ముగిసిన కుంభమేళా.. చివరిరోజున భక్తుల సంఖ్య?
ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా ముగిసింది.

ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా ముగిసింది. జనవరి 13వ తేదీన మొదలయిన మహాకుంభమేళా ఈరోజుతో ముగిసింది. రోజుకు కోటికి మంది పైగానే భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేశారు. అంత మంది వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిఏర్పాట్లను చేస్తున్నారు. మహా శివరాత్రి రోజున కుంభమేళాలో స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు వచ్చినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది.
చివరి రోజు...
ఒక్క చివరరోజైన నేడు రెండున్నర కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకూ ప్రయాగ్ రాజ్ లో మొత్తం 68 కోట్ల మంది వరకూ భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతెలిపింది. దాదాపు నలభై ఐదు రోజుల పాటు జరిగిన కుంభమేళాలో తొక్కిసలాట సంఘటన తప్ప అంతా ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story

