Fri Dec 05 2025 11:10:37 GMT+0000 (Coordinated Universal Time)
Tamilnadu : నేడు మద్రాస్ హైకోర్టులో కరూర్ ఘటనపై విచారణ
తమిళనాడులోని కరూర్ లో జరిగిన సభలో జరిగిన తొక్కిసలాటపై నేడు మద్రాస్ హైకోర్టులో న్యాయస్థానం విచారణ జరపనుంది.

తమిళనాడులోని కరూర్ లో జరిగిన సభలో జరిగిన తొక్కిసలాటపై నేడు మద్రాస్ హైకోర్టులో న్యాయస్థానం విచారణ జరపనుంది. శనివారం కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించారు. ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని, దీనిపై సీబీఐ చేత విచారణ జరపాలని టీవీకే న్యాయస్థానం ఆశ్రయించింది. ర్యాలీపై రాళ్ల దాడి జరిగిందని, ఆ వెంటనే పోలీసులు లాఠీఛార్జ్ చేయడమే తొక్కిసలాటకు కారణమని టీవీకే అధినేత విజయ్ ఆరోపించారు. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు
అత్యవసర విచారణ చేపట్టాలని...
హైకోర్టులో అత్యవసర విచారణ చేపట్టాలని విజయ్ తన పిటీషన్ లో కోరారు. విజయ్ తన న్యాయ నిపుణులతో ఉదయం జరిపిన చర్చల అనంతరం ఈ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు సెలవులు ఉన్నప్పటికీ దీనిని అత్యవసరంగా విచారించాలన్న విజయ్ విజ్ఞప్తిని జస్టిస్ దండపాణి అంగీకరించారు. ఈరోజు మధురై బెంచ్‌లో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయ వర్గాలు తెలిపాయి. దీంతో నేడు కరూర్ లో జరిగిన తొక్కిసలాటపై మధురై బెంచ్ లో విచారణ జరిగే అవకాశముంది.
Next Story

