Mon Mar 02 2026 14:33:58 GMT+0530 (India Standard Time)
lunar Eclipse : చంద్రగ్రహణం... భారత్లో ఎప్పుడు, ఎంతసేపు కనిపిస్తుంది?
మంగళవారం చంద్రగ్రహణం ఏర్పడనుంది.

మంగళవారం చంద్రగ్రహణం ఏర్పడనుంది. రేపు రాష్ట్రంలోని అన్ని ఆలయాలను మూసివేయనున్నారు. అయితే చంద్రగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు ముగస్తుంది అన్న దానిపై పండితులు చెబుతున్నదేమిటంటే.. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.48 గంటలకు చంద్రగ్రహణం వీడుతుంది.
భారత్ లో మాత్రం...
భారత్లో సాయంత్రం 6.20 నుంచి సుమారు 27 నిమిషాలు కనిపిస్తుంది. అండమాన్, ఈశాన్య రాష్ట్రాల్లో మినహా దేశమంతా సంపూర్ణ గ్రహణం వీక్షించవచ్చు. చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేసి ఇల్లును శుభ్రపర్చుకోవాలని పండితులు సూచిస్తున్నారు. తదుపరి సంపూర్ణ చంద్రగ్రహణం 2028 డిసెంబరు 31న చూడొచ్చని చెప్పారు.
Next Story

