Thu Dec 18 2025 22:57:05 GMT+0000 (Coordinated Universal Time)
ప్రజ్వల్ రేవణ్ణ ఓటమి
కర్ణాటకలోని హాసన్ లో ఎన్డీయే కూటమి అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ

కర్ణాటకలోని హాసన్ లో ఎన్డీయే కూటమి అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ ఎం.పాటిల్ చేతిలో 43వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు ప్రజ్వల్ రేవన్న. మహిళలపై లైంగిక దౌర్జన్యం, కిడ్నాప్ వంటి ఆరోపణలపై ఇటీవల ప్రజ్వల్ రేవన్న అరెస్ట్ అయ్యాడు.
కర్ణాటకలోని హసన్ నియోజకవర్గంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయాస్ ఎం.పటేల్‌కు ఓట్లు వేసి జనతాదళ్ (సెక్యులర్) సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణను శిక్షించారు. లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులో నిందితుడైన రేవణ్ణ హసన్ లోక్‌సభ స్థానంలో 44 వేల ఓట్ల తేడాతో పటేల్ చేతిలో ఓడిపోయారు. మొదట కొన్ని రౌండ్స్ లో ప్రజ్వల్ రేవణ్ణ లీడింగ్ లో ఉన్నట్లు కనిపించాడు. అయితే రౌండ్స్ ముందుకు కదలగా.. ప్రజ్వల్ ఓటమి అనివార్యమైంది.
Next Story

