Sun Jan 12 2025 20:28:09 GMT+0000 (Coordinated Universal Time)
మూడు సాగు చట్టాల రద్దుకు లోక్ సభ ఆమోదం
లోక్ సభలో మూడు వ్యవసాయ చట్టాల బిల్లులను రద్దు చేస్తూ ప్రవేశ పెట్టిన బిల్లుకు ఆమోదం లభించింది.
లోక్ సభలో మూడు వ్యవసాయ చట్టాల బిల్లులను రద్దు చేస్తూ ప్రవేశ పెట్టిన బిల్లుకు ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది. విపక్షాలు గొడవల మధ్యనే ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పంటలకు మద్దతు ధరపై చట్టం తేవాలని కోరుతూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈరోజే రాజ్యసభలోనూ ఈ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వాయిదా....
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు ఏడాదిగా ఢిల్లీ సరిహద్దుల్లో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించింది. మంత్రి వర్గం ఆమోదించింది. ఇప్పుడు లోక్ సభలోనే ఈ బిల్లులను రద్దు చేస్తూ ఆమోదించింది. లోక్ సభ మద్యాహ్నం రెండుగంటల వరకూ వాయిదా పడింది.
Next Story