Thu Jan 29 2026 08:53:30 GMT+0000 (Coordinated Universal Time)
Loksabha Elections : ముగిసిన చివరి దశ ఎన్నికలు.. కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్
లోక్సభ ఎన్నికలు ముగిశాయి. మొత్తం ఏడు విడతల్లో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి

లోక్సభ ఎన్నికలు ముగిశాయి. మొత్తం ఏడు విడతల్లో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఏడో విడత ఆఖరి దశలో ఈరోజు 57 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తుది విడత ఎన్నిక ముగియడంతో ఇక జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఆరు గంటలకు పోలింగ్ ముగిసింది. ఆరు గంటల దాటిన తర్వాత క్యూ లైన్ లో ఉన్న వారికి కూడా ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు.
మొత్తం 543 స్థానాలకు...
ఏప్రిల్ ఒకటో తేదీన తొలి దశ పోలింగ్ ప్రారంభమయింది. ఈరోజు తుది పోలింగ్ తో మొత్తం 543 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఈవీఎంలలో ప్రజలు తమ తీర్పును భద్ర పర్చారు. మరో మూడు రోజుల్లో కేంద్రంలో అధికారం ఎవరిది అన్నది తేలనుంది. అయితే అంతకు ముందుగా ఎగ్జిట్ పోల్స్ కోసం ప్రజలు ఉత్కంఠ భరితంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Next Story

