Mon Mar 16 2026 02:04:53 GMT+0530 (India Standard Time)
లాక్ డౌన్ లోకి వెళ్లిన ఢిల్లీ
ఢిల్లీలో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. శని, ఆదివారాలు ఢిల్లీలో లాక్ డౌన్ ను అమలు చేయనున్నారు.

ఢిల్లీలో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. శని, ఆదివారాలు ఢిల్లీలో లాక్ డౌన్ ను అమలు చేయనున్నారు. కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఢిల్లీలో వీకెండ్ లాక్ డౌన్ ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈరోజు, రేపు ఢిల్లీలో లాక్ డౌన్ అమలులో ఉండనుంది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం ఐదు గంటల వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుందని అధికారులు చెప్పారు.
కేసుల సంఖ్య.....
ఢిల్లీలో ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా పాజిటివ్ రేటు ఢిల్లీలో 17.73 శాతానికి చేరుకుంది. నిన్న ఒక్కరోజే ఢిల్లీలో 8,951 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వం ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. సినిమాహాళ్లను మూసివేశారు. కర్ఫ్యూ సమయంలో విమాన, రైలు ప్రయాణాలు చేసే వారికి మినహాయింపు ఉండనుంది.
Next Story

