Sun May 19 2024 20:02:29 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసులపై తిరగబడ్డ చిరుత..వీడియో వైరల్
హర్యానాలోని పానిపట్ సమీపంలో జరిగిందీ ఘటన. బెహరంపూర్ గ్రామంలో చిరుత సంచరిస్తోందని స్థానికులు అధికారులకు..
హర్యానా : చిరుతను బంధించేందుకు వెళ్లిన పోలీసులపై చిరుత తిరగబడింది. చిరుత దాడిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు ఫారెస్ట్ అధికారులకు గాయాలయ్యాయి. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని పానిపట్ సమీపంలో జరిగిందీ ఘటన. బెహరంపూర్ గ్రామంలో చిరుత సంచరిస్తోందని స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. దాంతో చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లారు.
చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించిన వారిపై చిరుత దాడి చేసింది. కర్రలు పట్టుకుని.. పోలీసులు చుట్టుముట్టినా.. ఏం లాభం లేకపోయింది. ఒక్కసారిగా చిరుత మీదికి రావడంతో నలుగురు గాయపడ్డారు. వెంటనే దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. గాయపడిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులను ఆస్పత్రికి తరలించారు. వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story