Sun Feb 01 2026 08:48:46 GMT+0000 (Coordinated Universal Time)
రెహమాన్ కు అరుదైన గౌరవం
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కు మరో అత్యున్నత పురస్కారం లభించింది.

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కు మరో అత్యున్నత పురస్కారం లభించింది. కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెహమాన్ ను సత్కరించి అరుదైన గౌరవాన్ని ఇచ్చారు. 43వ కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెహమాన్ ను నిర్వాహకులు ప్రత్యేకంగా సత్కరించడం దేశాన్ని గౌరవించడమే. ఈ సత్కారం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఈజిప్టును సందర్శించడం ఆనందంగా ఉందని రెహమాన్ పేర్కొన్నారు.
ఎన్నో పురస్కారాలు.. సత్కారాలు....
రహమాన్ ఖాతాలో ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు. 54 ఏళ్ల రహమాన్ బాలివుడ్, టాలీవుడ్, కోలివుడ్ లలో ఎన్నో చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. 90 వ దశకంలో వచ్చిన రోజా చిత్రంతో రెహమాన్ కు బ్రేక్ వచ్చింది. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి దర్శకతం వహించిన రెహమాన్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
Next Story

