Sat Dec 13 2025 14:30:00 GMT+0000 (Coordinated Universal Time)
Sabarimala : నేడు శబరిమలలో జ్యోతి దర్శనం
శబరిమలలో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. నేడు జ్యోతి దర్శనం కోసం లక్షల సంఖ్యలో భక్తులు చేరుకున్నారు

శబరిమలలో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. నేడు జ్యోతి దర్శనం కోసం లక్షల సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. అత్యధిక మంది భక్తులు చేరుకోవడంతో అయ్యప్ప కొండ స్వామి శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగిపోతుంది. ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజున శబరిమలలో జ్యోతి దర్శనం లభిస్తుంది. ఈ జ్యోతి దర్శనం చూసేందుకు అయ్యప్ప భక్తులు లక్షల సంఖ్యలో అనేక రాష్ట్రాల నుంచి చేరుకోవడం సంప్రదాయంగా వస్తుంది. జ్యోతి దర్శనం అయితే తమకు మోక్షం లభిస్తుందని భావిస్తారు.
మాల వేసుకునే...
అయ్యప్ప మాల వేసుకునే ప్రతి భక్తుడు జ్యోతి దర్శనం చూడాలని పరితపిస్తాడు. అందుకోసం నలభై రోజుల పాలు మాల వేసుకుని ఎదురు చూస్తుంటాడు. శబరిమల కొండల్లో కనిపించే జ్యోతి దర్శనం అయితే తమ జీవితం ధన్యమయినట్లేనని భావిస్తారు. అందుకే ఈరోజు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని ముందుగా అంచనా వేసుకుని ట్రావెన్ కోర్ దేవస్థానం అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. సాయంత్రం జ్యోతి దర్శనం కోసం భక్తులు ఇప్పటి నుంచే శబరిమలకు క్యూ కడుతున్నారు.
Next Story

